ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటకాలువలో గుర్తు తెలియని మృతదేహం - latest crime news at nallajarla canal

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం కలకలం రేపింది. నెల రోజుల క్రితం చంపి.. సంచిలో మూటగట్టినట్లు తెలుస్తోంది.

పంటకాలువలో గుర్తు తెలియని మృతదేహం
పంటకాలువలో గుర్తు తెలియని మృతదేహం

By

Published : Apr 25, 2020, 7:08 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో స్థానికులకు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం కనిపించింది. దుండగులు హత్య చేసి సంచిలో మూటగట్టి ఎర్రకాలువలో పడేసినట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించగా వారు వివరాలు సేకరిస్తున్నారు. సుమారు నెలక్రితం హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో ఉన్న దుస్తులను బట్టి మృతి చెందిన వ్యక్తి మహిళగా భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి జిల్లాకు చెందిన వారా? లేక ఇంకెక్కడైనా హత్య చేసి ఇక్కడ పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details