Central Minister Shekhawat visit polavaram : నేడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను, పునరావాస కాలనీలను సీఎం వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడి నిర్వాసితులతో మాట్లాడతారు.
నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్రమంత్రి - AP News
Central Minister Shekhawat : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సీఎం జగన్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. నేడు పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. గోదావరి జిల్లాల్లోని నిర్వాసితులతో మట్లాడనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
Central Minister Shekhawat
అనంతరం అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి... జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.
ఇదీ చదవండి:POLAVARAM: పోలవరం ఎత్తు తగ్గిస్తే.. ఉత్త బ్యారేజే!