ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట కాలువలో మృతదేహం లభ్యం - crop canal

పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.

గుర్తు తెలియని మృతదేహం

By

Published : Jul 30, 2019, 6:15 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం శివారు పంటకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు నలభై సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం కాలువలో కొట్టుకుని రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహం ఉబ్బి ఉండటం వల్ల రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details