ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సహాయ నిధికి విరాళాలు అందించిన ఉండ్రాజవరం దాతలు - donations to cmrf from undrajavaram

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. కరోనా వైరస్​ నివారణకు తమ వంతు సాయంగా చెక్కులను నిడదవోలు ఎమ్మెల్యేకు అందించారు.

donations to cmrf from undrajavaram
సీఎం సహాయ నిధికి విరాళాలు అందించిన ఉండ్రాజవరం దాతలు

By

Published : Apr 25, 2020, 2:59 PM IST

Updated : Apr 25, 2020, 4:30 PM IST

కరోనా వైరస్ నివారణ చర్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలానికి చెందిన పలు అసోసియేషన్లు, సంస్థలు, దాతలు తమ విరాళాలను నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడుకు అందజేశారు.

* ఉండ్రాజవరం పౌల్ట్రీ ఫెడరేషన్ అసోసియేషన్ తరఫున ఈడుగుపుగంటి సత్యనారాయణ 3 లక్షల 58 వేల చెక్కును అందజేశారు.

* ఉండ్రాజవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లక్ష 50 వేల రూపాయలు విరాళమిచ్చారు.

* రేణుక ఫిల్లింగ్ స్టేషన్ అధినేత బురుగుపల్లి సుబ్బారావు ప్రజల విరాళాంతో కలిపి లక్ష రూపాయలు ఇచ్చారు.

* కె. సావరంలోని కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత చిలకూరి రామకృష్ణ 2 లక్షలు అందించారు.

విరాళాలు అందించిన దాతలందరికీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:డబుల్ ధమాకా... ఒకే కాన్పులో రెండు దూడలు

Last Updated : Apr 25, 2020, 4:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details