ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం పున:ప్రారంభం - korukallu

పశ్చిమగోదావరి జిల్లా కోరుకొల్లులో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునః ప్రారంభించారు. కృష్ణ శిలలతో దేవాలయాన్ని నిర్మించడం విశేషం.

పునః ప్రారంభించిన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం

By

Published : Jun 27, 2019, 8:32 PM IST

పునః ప్రారంభించిన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకొల్లులో కృష్ణ శిలలతో నిర్మించిన ఉమారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునః ప్రారంభం చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాన్ని ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాళ్లాయపాలెం క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి, పెద్దపులి పాక సిద్ధాంతి వాసుదేవ నందగిరి స్వాముల పర్యవేక్షణలో జరిగింది. ఆలయ శిల్పి సేతు రామన్​ని స్వర్ణ కంకణంతో సన్మానించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details