పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 రోజులుగా పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజూ 150 మందికి అన్నం ప్యాకెట్లు పంచుతూ తమ ఔదార్యం చాటుకుంటున్నారు. ట్రస్ట్ జిల్లా కన్వీనర్ నందం తాతయ్య ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.
అత్తిలిలో ఉమర్ అలీషా ట్రస్టు వితరణ - Umar Alisha Trust donating food to the poor
కరోనా విపత్తు వేళ పేదల ఆకలి తీర్చటానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ అలీషా ట్రస్ట్ సభ్యులు పేదలకు 25 రోజులుగా ఆహారం అందిస్తున్నారు.
ఉమర్ ఆలీషా ట్రస్ట్ వితరణ