ఇళ్ల స్థలాలు రాలేదని సెల్ టవర్ ఎక్కిన ఇద్దరు యువకులు - west godavari district latest news
ఇళ్ల స్థలాలు రాలేదని ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తీపర్రు గ్రామంలో జరిగింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సెల్ టవర్ ఎక్కి ఇద్దరు యువకుల హల్ చల్
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం, తీపర్రు గ్రామంలో దాసరి సోమయ్య, కాపక సతీశ్ అనే ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన ఆ యువకులు తమ ఉళ్లో ఇళ్ల స్థలాలు సక్రమంగా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థల నిమిత్తం ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన 20 వేల రూపాయలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.