ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండగ పూట విషాదం.. స్నానానికెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి! - పండగ పూట విషాదం వార్తలు

సంక్రాంతి పండగ వేళ పశ్చిమగోదావరి జిల్లా కేతవరంలో విషాదం చోటుచేసుకుంది. కాలువలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు. దీంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

పండగ పూట విషాదం
పండగ పూట విషాదం

By

Published : Jan 16, 2022, 10:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేతవరంలో పండగ పూట విషాదం నెలకొంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు కాలువలో స్నానానికి దిగి ప్రాణాలు విడిచారు.

వివరాల్లోకి వెళితే.. కేతవరం గ్రామానికి చెందిన ముఖేష్ (22), ఇతని అన్న కుమారుడు గణేశ్ (19) మరికొంత మంది స్నేహితులతో కలిసి గంగవరం - రాజవరం గ్రామాల శివారులోని ఎర్ర కాలువ వద్ద స్నానానికి వెళ్లారు. ముందుగా గణేశ్, ముఖేశ్​తోపాటు మరో స్నేహితుడు పవన్ కాలువలోకి దిగారు. కాలువలో లోతు ఎక్కువగా ఉందని పవన్ హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా ఇరువురూ లోపలికి వెళ్లారు.

దీంతో.. ఇద్దరూ మునిగిపోయారు. వారిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు కాలువ వద్దకు చేరుకొని భోరున విలపించారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

వీరిలో గణేశ్ కృష్ణా జిల్లా తిరువూరులో ఇంజనీరింగ్ చదువుతుండగా.. ముఖేశ్ జంగారెడ్డి గూడెం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. పండగ పూట ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి :

పాత బావి విషయంలో గొడవ.. కొడవళ్లు, రాళ్లతో దాడికి ఎమ్మెల్సీ వర్గీయుల యత్నం

ABOUT THE AUTHOR

...view details