పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధి రామచంద్రపురంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్య భర్తలను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త, కుమార్తె తీవ్ర గాయాలవగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలవరం మండలం కొమ్ముగూడేనికి చెందిన భూక్యా శ్రీనివాసరావు, సుజాత వారి కుమార్తె హర్షిత కలిసి జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మరో పది నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకుంటామనుకోగా కారు రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని వెంటాడింది. వెనుక నుంచి కారు ఢీ కొట్టి పరారయ్యింది. ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శ్రీనివాసరావు, కుమార్తె హర్షిత కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు.
ద్విచక్ర వాహనం కారు ఢీ.. ఒకరి మృతి - latest west godavari district news
జంగారెడ్డిగూడెం పరిధి రామచంద్రపురంలో వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. భార్య భర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనం కారు ఢీ.. ఒకరు మృతి