పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో గీత ఆసుపత్రి నిర్వహకులు.. వెలగల తిరుమల శ్రీనివాసరెడ్డికి చెందిన సొమ్ము చోరీకి గురైంది. ఈనెల ఒకటో తేదీన రెండు లక్షల 79 వేల రూపాయలు దుండగులు అపహరించుకు పోయారు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి.. ఆసుపత్రిలో పని చేస్తున్న కావలి పురానికి చెందిన కర్రి పెద్ద సత్తిబాబు, తణుకు పాత ఊరుకు చెందిన తుమ్మెద శ్రీనివాస రాజులను నిందితులుగా గుర్తించారు.
యజమానిని నమ్మించి దోచుకున్న దొంగలు అరెస్ట్
యజమానికి నమ్మకంగా వ్యవహరిస్తూ.. అందినకాడికి దోచేశారు ఇద్దరు వ్యక్తులు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు ఇంటి దొంగలను కనిపెట్టారు.
యజమానిని నమ్మించి దోచుకున్న దొంగలు అరెస్ట్
తణుకు ఆర్టీసీ బస్ స్టేషన్లో వారిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుంచి అపహరణకు గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తణుకు కోర్టులో హాజరు పరిచామని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు.
ఇదీ చదవండీ..వీరవాసరం పోలీస్ స్టేషన్లో చోరీ... రూ.8 లక్షలు అపహరణ