పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో గోదావరి నదిలో గల్లంతైన ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పట్నాల మణికంట, తణుకు మండలం చెందిన బచ్చల కళ్యాణ్గా గుర్తించారు.
సరదా కోసం దిగారు... ప్రాణాలు పోగొట్టుకున్నారు - two students died in godavari river
ఆదివారం సెలవు కావటంతో సరదాగా గడపటానికి నది తీరానికి వెళ్లారు నలుగురు విద్యార్థులు. స్నానం చేయటానికి నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయి..మృతి చెందారు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
సరదా కోసం దిగారు... శవమై తేలారు
తణుకులో శశి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు ఆదివారం సెలవు కావటంతో గోదావరి నది వద్దకు వచ్చారు. స్నానం చేసేందుకు నదిలోకి దిగినప్పుడు ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి