పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లిలో పొలం సరిహద్దు విషయంలో అక్క చెల్లెల కుటుంబాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఆడమిల్లి గ్రామానికి చెందిన బాబురావు, లీల తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పామాయిల్ గెలల విషయంలో పదేళ్లుగా రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంటుందని ఇద్దరిపై అనేక సార్లు కేసులు నమోదు చేశామని తడికలపూడి పోలీసులు తెలిపారు.
పామాయిల్ గెలల కోసం ఇరు కుటుంబాల ఘర్షణ - two sisters family fight with knives latest news
పామాయిల్ గెలల విషయంలో 10 ఏళ్ల నుంచి అక్కచెల్లెల కుటుంబాలు మధ్య జరుగుతున్న పోరు ఉద్ధృతమైంది. కత్తులతో పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
అక్కాచెల్లెల్ల కుటుంబాలు కత్తులతో దాడులు