ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం పార్టీ తరువాత ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా నెగ్గిపూడి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తలు కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న గంట వ్యవధిలోని ఇద్దరు అస్వస్థతకు గురై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పెనుమంట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

two persons suspected death after celebrated party
మద్యం పార్టీ తరువాత ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి

By

Published : Nov 15, 2020, 7:47 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నలుగురు మార్టేరులోని ఒక కాంప్లెక్సులో మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ నలుగురిలో నల్లి కిషోర్‌, నల్లి సంపత్‌రావు అనే ఇద్దరు అస్వస్థతకు గురై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పార్టీలో మద్యం తాగి, చికెన్ తిన్నట్లు తెలిసింది. కిషోర్‌, సంపత్‌రావులు గంటల వ్యవధిలో మృతిచెందడం వల్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు కిషోర్ భార్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమంట్ర ఎస్సై రమేశ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details