ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు కార్లు ఢీ...ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా రోడ్డు ప్రమాద వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా కురెళ్లగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం విమానశ్రయానికి వెళ్తున్న కారు టైర్ పంచర్ కావటంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

two persons died in a road accident at kurellagudem
కురెళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

By

Published : Jan 18, 2021, 11:26 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది

తాడేపల్లిగూడెం పట్టణ భాజపా అధ్యక్షుడు ముప్పిడి సురేశ్ రెడ్డి తన కుమారుడిని విమానం ఎక్కించేందుకు కారులో గన్నవరం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కురెళ్లగూడెం వద్దకు వచ్చేసరికి టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి నెల్లూరు జిల్లా తల్లాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం చింతలంక వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చింతలంక గ్రామానికి చెందిన కుంచలపాటి రమావతి (45), వెంకటేశ్వరరావు (57) మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న సురేశ్ రెడ్డి, అతని కుమారుడు సతీశ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

ఇదీ చదవండి

వేర్వురు రోడ్డు ప్రమాదాలు... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details