పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చిన్నకాపవరంలోని రొయ్యల చెరువు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామానికి చెందిన కాటూరి రంగారావు.. 5ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఈరోజు ఉదయం చెరువులో రసాయనాలు చల్లేందుకు రంగారావు కొడుకు కాటూరి శ్రీకాంత్, సురేశ్ ఇద్దరు కలిసి పడవ తీసుకొని చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో చెరువు మధ్యలోకి వెళ్లాక ఆ పడవ తిరగబడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యవకులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రొయ్యల చెరువులో తిరగబడ్డ పడవ.. ఇద్దరు యువకులు మృతి - bot overturned in at shrimp pound
రొయ్యల చెరువులో ప్రమాదవశాత్తు పడవ తిరగపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చిన్నకాపవరంలో నెలకొంది.
రొయ్యల చెరువులో తిరగబడ్డ పడవ