ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసాపురం మండలంలో కంటైన్మెంట్​ - నరసాపురం కరోనా వార్తలు

నరసాపురం మండలం చామకూరి పాలెం పరిధిలో ఇద్దరు మహిళలకు కరోనా నిర్ధరణ కావటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​‌ జోన్‌గా ప్రకటించారు. గ్రామ పరిధిలో రాకపోకలను నిషేధిస్తూ ప్రధాన కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటుచేశారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరు మహిళలను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.

నరసాపురం మండలం మోడిలో కంటైన్​మెంట్​
నరసాపురం మండలం మోడిలో కంటైన్​మెంట్​

By

Published : Jun 1, 2020, 3:41 PM IST

పచ్చని పల్లెలకు కూడా కరోనా సెగ తప్పడం లేదు. వ్యవసాయ భూములు... ప్రశాంత వాతావరణం కలిగిన పల్లెలు కరోనా బారినుంచి తప్పించుకోలేకపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చామకూరి పాలెం పరిధిలో ఇద్దరు మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒకరు గర్భిణీ కాగా మరొకరు ఆశా వర్కర్. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​​ జోన్​గా ప్రకటించారు. 200 మీటర్లు పరిధిలో ఉన్న అన్ని రహదారులకు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. మరో 200 మీటర్లు మేర బఫర్​జోన్​గా వెల్లడించారు. మొగల్తూరు ఎస్​ఐ ప్రియకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెడ్​జోన్​ లోని ప్రజలు ఎవరు బయటకు రావొద్దని ప్రకటించారు. పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టి హైడ్రోక్లోరైడ్ ద్రావణం చల్లారు. వైద్యాధికారులు వైద్య శిబిరం ఏర్పాటుచేసి పలువురికి పరీక్షలు చేశారు. పది వైద్య బృందాలుగా ఏర్పడి గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు మహిళలను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. వారికి సంబంధించి ప్రాథమిక కాంటాక్ట్​లను గుర్తించి 41 మందిని తాడేపల్లిగూడెంలోని క్వారంటైన్​ కేంద్రానికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:24 గంటల్లో 8,392 కొత్త కేసులు.. 230 మరణాలు

ABOUT THE AUTHOR

...view details