పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బీసీ కళ్యాణ మండపం వద్ద నివసించే అందే దానయ్య(53) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరో ఘటనలో.. బర్ల వనజాక్షి(16) తండ్రి గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులకు గురయ్యాడు. మనస్థాపానికి గురైన వనజాక్షి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెండు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.