పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద లారీని ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఐస్ లోడ్ తో నారాయణపురం నుంచి పోతునూరు వైపు వెళ్తున్న లారీ.. గుండుగొలను వైపు నుంచి వస్తున్న ట్రాలీ లారీ ఢీకొన్నాయి. ఉండ్రాజవరం వంతెన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ఢీకొనడంతో.. ట్రాలీ ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ట్రాలీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి.. అక్కడికక్కడే మృతిచెందాడు.