అత్తిలిలో విషాదం.. ఫార్మాలిన్ కలిపిన నీళ్లు తాగి ఇద్దరు మృతి - పశ్చిమ గోదావరి జిల్లా
11:45 September 13
మంచినీళ్లు అనుకుని ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లు తాగి ఇద్దరు కార్మికులు మృతి
Two Men Died: పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో విషాదం చోటు చేసుకుంది. మంచినీళ్లు అనుకొని ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లు తాగిన ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామానికి చెందిన నడింపల్లి సుబ్బరాజు, పాత గొలుసు రామకృష్ణ గత రెండు సంవత్సరాలుగా అత్తిలిలోని ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. కోళ్లఫారంలో పెంపకానికి చిన్న పిల్లలు తీసుకువస్తున్న సందర్భంలో.. యజమానుల సూచన మేరకు ఫార్మాలిన్ మందును ఫారంలో స్ప్రే చేశారు. భోజనానికి వెళ్తున్న సమయంలో మందు కలిపిన నీళ్లను తాగారు. మందు నీళ్లు, మంచినీళ్లు ఉన్న డబ్బాలు పక్కనే పక్కనే ఉండగా పొరపాటున మంచినీళ్లు అనుకుని ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లను తాగారు. అస్వస్థతకు గురైన వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందడానికి ముందు బాధితుడు పొరపాటున ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లను తాగినట్లు తెలిపినట్లు సీఐ ఆంజనేయులు వివరించారు.
ఇవీ చదవండి: