accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి - saripalli accident updates
22:36 September 30
west accident
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సరిపల్లి పరిధి నరసాపురం-పాలకొల్లు జాతీయ రహదారి పై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పాలకొల్లు నుంచి రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ఐదుగురు యువకులును.. నరసాపురం నుంచి పాలకొల్లు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో పోడూరు మండలం జున్నూరు గ్రామానికి చెందిన వంశీ (17) , నరసాపురం పట్టణానికి చెందిన ముఖేష్ కుమార్(20), సుబ్రహ్మణ్యం (20)గా మృతి చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన వారు నర్సాపురానికి చెందిన సాయి, జున్నూరు గ్రామానికి చెందిన గని లు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న నరసాపురం సీఐ శ్రీనివాస్ యాదవ్ ఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి.