వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. తల్లాడ - దేవరపల్లి జాతీయ రహదారిపై ఉదయం లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దర్భగూడెంలో జరిగిన మరో ప్రమాదంలో వృద్ధుడిని లారీ ఢీకొట్టడం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి