current shock : విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి - గౌరీపట్నంలో విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి
15:15 September 24
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో విద్యుదాఘాతానికి ఇద్దరు రైతు కూలీలు మృతి చెందారు. అండ్రు శ్రీనివాస్ అనే రైతు పొలంలో ఎరువులు చల్లుతుండగా... విద్యుదాఘాతానికి గురయ్యారు. వరి పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద తీగ తెగి పడిపడటాన్ని... గమనించకపోవటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన అడపా వెంకట రత్నం, గంగరాజు వెంకటేశ్వరరావులుగా గుర్తించారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి