ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేదిలో టేకు చేప కుట్టి ఇద్దరు భక్తుల అస్వస్థత - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా... టేకు చేప కుట్టి ఇద్దరు భక్తులు అస్వస్థతకు గురైయ్యారు. బాధితులను వెంటనే రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

two devotees injured in antarvedi
అంతర్వేదిలో టేకు చేప కుట్టి ఇద్దరు భక్తుల అస్వస్థత

By

Published : Feb 28, 2021, 2:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు సముద్రంలో స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో బెల్లంకొండ రాజబాబు, పెచ్చెట్టి వరలక్ష్మి అనే భక్తులు.. టేకు చేప కుట్టడంతో అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే స్పందించిన స్థానిక భక్తులు, బంధువులు... వారిని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ చేప కుడితే 24 గంటలపాటు విపరీతమైన నొప్పి ఉంటుందని.. అయితే ప్రాణాపాయమేమీ ఉండదని స్థానిక మత్స్యకారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details