క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన గురువెల్లి నాగేశ్వరరావు, ఒగ్గు సత్యనారాయణ అనే వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని బెట్టింగ్ స్థావరంపై.. చేబ్రోలు పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి 3,900 రూపాయల నగదు, 2 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వీర్రాజు తెలిపారు తెలిపారు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిని పట్టుకున్నట్లు వివరించారు.
ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్.. నగదు స్వాధీనం - twoi bookies arrest in west godavari
ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సమయంలో బెట్టింగ్‌లో పాల్గొన్న ఇద్దరిని.. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3,900 రూపాయల నగదుతో పాటు రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీర్రాజు వెల్లడించారు.

అరెస్టైన క్రికెట్ బుకీలు