పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. బ్యాంకు ఉద్యోగి ఇటీవల విజయవాడ బ్యాంకులో మూడు రోజులు పని నిమిత్తం వెళ్లి అక్కడ విధులు నిర్వర్తించారు. ఈ నెల 5వ తేదీన జంగారెడ్డిగూడెం వచ్చి బ్యాంకులో విధులు నిర్వహిస్తుండగా గొంతు నొప్పి దగ్గు జలుబుతో బాధ పడ్డారు. అనుమానంతో ట్రూనాట్ పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం గంగానమ్మ కూడలిలో పురపాలక అధికారులు కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామంలో హైదరాబాదు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన కరోనా పాజిటివ్ కేసులు - latest west godavari district news
జంగారెడ్డిగూడెంలో ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. కళ్ళచెరువు గ్రామంలో హైదరాబాదు నుంచి వచ్చిన వ్యక్తికి కూడా పాజిటివ్ గా గుర్తించారు.
జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన కరోనా పాజిటివ్ కేసులు