ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి - bavaipalem crime news

పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో విషాదం జరిగింది. మంచినీటి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆ ఇద్దరూ.. అన్నదమ్ముల కుమారులు. వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

two chilren died in pond at bavaipalli in west godavari district
బవాయిపాలెంలో చెరువులో పడి చిన్నారులు మృతి

By

Published : Apr 18, 2021, 6:49 AM IST

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ విషాదం పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు విప్పర్తి యొహాన్ ఐటీడీసీలో, విప్పర్తి బెంజిమన్ ఏపీఎస్పీలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

వీరి కుమారులు సైమన్ (4), సంతోష్ (7)... శనివారం మధ్యాహ్నం బావాయిపాలెంలోని చెరువు వద్ద జారుడు బల్ల మీద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. వారి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details