అప్పటి వరకు తల్లిదండ్రుల చెంతనే ఆటలాడుకుని బహిర్భూమికని వెళ్లిన చిన్నారులు క్వారీ గుంతల్లో విగతజీవులుగా కనిపించడంతో గ్రామంలో విషాదం అలముకుంది. పెదవేగి మండలం జానంపేట శివారు ప్రకాష్‌నగర్‌కు చెందిన అన్నదమ్ములైన తమ్మిశెట్టి పెద్దగుర్రాజు, తమ్మిశెట్టి దుర్గారావుల కుమారులు హేమంత్, సందీప్ లు ఇంటి వద్దే ఆడుకున్నారు. తరువాత ప్రకాష్‌నగర్ వద్ద గల క్వారీ వద్దకు బహుర్భూమికి వెళ్లారు. అక్కడ ఒకరు క్వారీ గుంతలో జారిపడగా... అతన్ని రక్షించేందుకు మరొకరు క్వారీ గోతిలోకి దిగి మునిగిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరాడక చనిపోయారు. రాత్రి 8 గంటలైనా అన్నదమ్ములు ఇద్దరు ఇంటికి చేరుకోక పోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. జాడ కనిపించక పోవడంతో అనుమానంతో క్వారీ గుంతల వద్ద చూడగా హేమంత్, సందీప్‌ల మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. కుమారుల మృతిని భరించలేక తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు చిన్నారులను మింగిన క్వారీ - పశ్చిమగోదావరిలో క్వారీ గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి
అప్పటి వరకు తల్లిదండ్రుల చెంతనే ఆటలాడుకుని బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు... క్వారీ గుంతల్లో విగతజీవులుగా కనిపించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు చిన్నారులను మింగిన క్వారీ