ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు - ఇద్దరు బాలురులు అదృశ్యం తాజా వార్తలుట

శనివారం మధ్యాహ్నం ఇద్దరు బాలురు బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవటంతో పశ్చిమ గోదావరి జిల్లా గాలాయగూడెంలో ఆందోళన రేకెత్తిస్తోంది. బాలురు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Two boys missing in Galayagudem
గాలాయగూడెంలో ఇద్దరు బాలురులు అదృశ్యం

By

Published : Jan 10, 2021, 3:30 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యం కలకలం రేపుతోంది. బాలురు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామానికి చెందిన మేడూరి యశ్వంత్(11), కూచిపూడి అభిరామ్ (12) ఇద్దరూ వేర్వేరు చోట్ల ఆరో తరగతి చదువుతున్నారు. శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ సైకిల్​పై బయటకు వెళ్లారు. అప్పటినుంచి తిరిగి ఇంటికి చేరలేదు. బాలురు తల్లిదండ్రులు బంధువులు వారి కోసం పరిసర గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details