రెండు ద్విచక్రవానాలు ఢీ...ఒకరికి తీవ్ర గాయాలు - పుట్లగట్లగూడెంలో రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
![రెండు ద్విచక్రవానాలు ఢీ...ఒకరికి తీవ్ర గాయాలు Two bicycles accident at putlagutlagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7887793-578-7887793-1593871381128.jpg)
రెండు ద్విచక్రవానాలు ఢీ...ఒకరికి తీవ్ర గాయాలు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు జంగారెడ్డిగూడానికి చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు. ఆయిల్ ఫామ్ కర్మాగారంలో లారీ డ్రైవర్గా పని చేస్తున్నారు. తన మిత్రుడిని వదిలి పెట్టి తిరిగి వస్తుండగా...ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకి బలమైన గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.