అంతర్జాతీయ కవల పిల్లల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో వివిధ తరగతుల్లో చదువుతున్న 25 మంది కవలల జంటలతో వేడుక చేశారు. వారికి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. పూలు, పళ్లు పంపిణీ చేశారు. స్నేహితుల మధ్య ఈ వేడుక నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని కవల పిల్లలు సంతోషించారు.
అబ్బబ్బ ఎంత ఎంత ముద్దుగున్నారే...! - తణుకులో ట్విన్స్ డే వేడుకులు
కవల పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటిది ఏకంగా 25 మంది కవల జంటలు.. ఒకే పాఠశాలలో చదవడం యాదృచ్ఛికమే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో ఇంత మంది కవల పిల్లలు చదువుతున్నారు. ట్విన్స్ డే సందర్భంగా ఇవాళ సందడి చేసి ఆకట్టుకున్నారు.
మాంటిస్సోరి స్కూల్లో ట్విన్స్ డే వేడుకులు