jangareddygudem death case: ఇంటికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తమవారి అకాల మరణానికి కారణం నాటుసారా రక్కసేనని జంగారెడ్డిగూడెం బాధిత కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. ఇది సహజ మరణం అని ప్రభుత్వం ఎంతగా వాదించి తమను బెదిరించి భయపెట్టినా మనోభావాలు చంపుకుని అబద్దాన్ని నిజంగా ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు. తమతో కలెక్టరేట్ వద్ద తప్పుడు నివేదికపై సంతకం పెట్టించేందుకు ఎంతలా ప్రయత్నించినా ఆత్మాభిమానాన్ని చంపుకోలేదని వివరించారు.
జంగారెడ్డిగూడెం ఘటనకు కల్తీసారానే కారణమని బాధిత కుటుంబసభ్యులు పోలీసుల సమక్షంలో తేల్చిచెప్పారు. కొందరు నిజాల్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సహజ మరణాలంటూ చీకటి కోణాల్ని వెలుగులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లనీయకుండా బెదిరించారని వెల్లడించారు.
కల్తీసారా ప్రభావం కాకపోతే ఒకేరకమైన లక్షణాలతో వరుస మరణాలు ఎలా చోటు చేసుకుంటాయని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నించారు. ఇకపై తమ కుటుంబాలు గడిచేదెలాగంటూ ఆవేదన వ్యక్తం చేశారు