పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో శ్రీవారి దర్శనం పూర్తిగా నిలిపి వేసిన కారణంగా... భక్తుల చెంతకే స్వామివారి ప్రసాదాలు అందివ్వాలన్న పాలకమండలి నిర్ణయంతో ఈ విక్రయాలు మొదలుపెట్టారు. మొత్తం పది వేలు లడ్డూలు తీసుకురాగా మధ్యాహ్నానికే అమ్మకాలు పూర్తయ్యాయి.
జంగారెడ్డిగూడెంలో తిరుమల శ్రీవారి ప్రసాద విక్రయం
జంగారెడ్డిగూడెం తితిదే కళ్యాణ మండపంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. ఒక్కొక్క లడ్డూ 25 రూపాయల చొప్పున భక్తులకు అందజేశారు.
తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి ప్రసాదాల విక్రయాం