పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం డీసీసీబీ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. బుట్టాయగూడెంలో కరోనా కేసుకు అధికంగా నమోదు అవుతున్నందున బ్యాంక్ ఉన్న ప్రదేశాన్ని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో బ్యాంక్‌ను మూసివేశారు. గురువారం రాత్రి దుండగులు గ్యాస్ కట్టర్‌తో బ్యాంక్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడి నుంచి దుండగులు ఉడాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బుట్టాయిగూడెం బ్యాంకులో చోరీకి దుండగుల విఫలయత్నం - బుట్టాయిగూడెం నేర వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని ఓ బ్యాంకులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బుట్టాయిగూడెం బ్యాంకులో చోరీకి దుండగుల విఫలయత్నం