ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జీవో 3 రద్దు చేయడమంటే.. గిరిజనుల పొట్ట కొట్టడమే' - g.o. number 3 latest news

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీలో జీవో నెంబర్ 3 రద్దును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.

tribals protest at kotaramachandrapuram
కోటరామచంద్రాపురంలో గిరిజనుల ఆందోళన

By

Published : Jul 1, 2020, 4:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురం ఐటీడీఏ వద్ద సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 3ను చట్టం చేయాలంటూ కోరారు.

జీవో 3 రద్దు చేయడమంటే.. గిరిజనుల పొట్ట కొట్టడమే అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని డిమాండ్ చేశారు. రద్దు వల్ల గిరిజనుల ఉనికి కూడా పోయే ప్రమాదం ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి.ఉరవకొండలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details