ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం... గిరిజన యువతకు ఉపాధి మార్గం... - వెదురుతో వస్తువులు తయారుచేస్తున్న గిరిజన యువత కథనం

ప్లాస్టిక్.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. తాగే బాటిళ్లు, తినే ప్లేట్లు, ఇంట్లో అలంకరణ వస్తువులు, ఎటు చూసినా ప్లాస్టిక్కే. ఆరోగ్యానికీ, పర్యావరణానికీ హానికరమని తెలిసినా వాడకాన్ని తగ్గించుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన యువత సాంప్రదాయ వెదురు వస్తువులపై దృష్టిపెట్టారు. ఐటీడీఏ సహకారంతో మెళకువలు నేర్చుకుని.. వస్తువులను మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఉపాధి పొందడమే కాక.. పర్యావరణ పరిరక్షణకు సాయపడుతున్నారు.

tribal youth manufactured bamboo furniture story
వెదురుతో వస్తువులు తయారుచేస్తున్న గిరిజన యువత కథనం

By

Published : Jan 4, 2020, 7:47 PM IST

గతంలో గిరిజనులు వెదురు వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక గిరాకీ తగ్గి ఉపాధి పోయింది. ప్లాస్టిక్ పెనుముప్పుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయమైన వెదురు వస్తువులపై అందరూ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ వస్తువుల తయారీ ఊపందుకుంటోంది.

ఐటీడీఏ సహకారంతో

పశ్చిమగోదావరి జిల్లాలో ఐటీడీఏ, ఏపీఎస్ఎస్​డీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు వెదురు వస్తువుల తయారీ నేర్పిస్తున్నారు. నేటి కాలానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. అలంకరణ వస్తువులు, ఫర్నీచర్ తయారుచేసి ఆ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్. పురం ఐటీటీఏ కార్యాలయ ఆవరణలో 'గిరిజన యూత్ శిక్షణా కేంద్రం' పేరుతో శిక్షణా కేంద్రం ఏర్పాటుచేశారు. 2 నెలలపాటు సాగే ఈ శిక్షణలో ట్రెండ్​కు తగ్గట్లు వెదురు వస్తువులు తయారు చేయడం.. వాటిని మార్కెటింగ్ చేసుకోవడంపై శిక్షణ ఇస్తారు. ఇలా దాదాపు 12 వందల మంది శిక్షణ పొందారు.

ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది

పశ్చిమగోదావరి జిల్లాలో కొండరెడ్డి తెగకు చెందిన గిరిజనులు అధికంగా ఉన్నారు. వీరికి వెదురు అందుబాటులో ఉంటుంది. అందుకే శిక్షణ కోసం వీరినే ఎంచుకున్నారు. వెదురుతో కుండీలు, బుట్టలు, లెటర్ బాక్స్, మొబైల్ బాక్స్, అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఖరీదైన రెస్టరెంట్లలో వాడే ఫర్నిచర్​నూ వీళ్లు రూపొందిస్తున్నారు. ఈ వస్తువులు దేశంలో పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వెదురు వస్తువులతో ప్లాస్టిక్ వాడకం కొంతవరకైనా తగ్గుతుందని గిరిజన యువత భావిస్తున్నారు.

వెదురుతో వస్తువులు తయారుచేస్తున్న గిరిజన యువత కథనం

ఇవీ చదవండి..

టీజర్: ప్రేమంటే సర్దుకుపోవడం కాదు.. ప్రేమంటే త్యాగం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details