పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో దళితుల భూమి ఇళ్ల స్థలాలకు తీసుకుంటున్నారని ధర్నా చేపట్టారు. పేదల భూములు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పేరుతో నాయకులు కబ్జా చేస్తున్నారంటూ.. నినాదాలు చేశారు. దశాబ్దాలుగా దళితులు సాగుచేసుకుంటున్న పొలాలు.. ఇంటి స్థలాల పేరుతో ప్రభుత్వం లాక్కుంటోందని వారు వాపోయారు. ఇంటి స్థలాల కోసం ఇతర భూములు ఉన్నా.. నిరుపేదల భూములనే స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల కోసం దళితుల భూములు తీసుకుంటున్నారని ఆందోళన - tribals news in west godavari dst
దళితులు సాగుచేసుకుంటున్న భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరిట తీసుకుంటోందని పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో దళితుల ఆందోళన చేశారు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములను తీసుకోవద్దని డిమాండ్ చేశారు.
tribal protest in west godavari dst about lands taking by govt in west godavari dst