పోడు భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ.. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలతో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. పోడు భూములపై తమకు హక్కులు కల్పించాలని నినాదాలు చేశారు. కొండ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న తమకు పోడుభూములు సాగుచేసుకొనే హక్కు లేదనడం ఎంత వరకూ న్యాయమంటూ గిరిజనులు ప్రశ్నించారు. ఈ మేరకు తమకు పూర్తి హక్కులు కల్పించాలని గిరిజనులు ...కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
పోడు భూములపై హక్కుల కోసం కదం తొక్కిన గిరిజనం - కొండపోడు భూముల కోసం గిరిజనులు ధర్నా
పోడు భూములను సాగుచేసుకునేందుకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ...గిరిపుత్రులు ఆందోళ బాటపట్టారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరుకు తరలివచ్చిన వందలాది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లపై కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
పోడు భూములపై హక్కుల కోసం కదం తొక్కిన గిరిజనం