'నా ఊపిరి' పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ప్రారంభించారు. భీమడోలు మండలం గుండుగొలను ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రతి పాఠశాల ఆవరణంలోను విద్యార్థుల విధిగా మొక్కలు నాటేలా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. పర్యారవణం, అడవులు పట్ల విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నా ఊపిరి..ఇది మొక్కలు నాటే పథకం - జిల్లా కలెక్టర్
పశ్చిమగోదావరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పథకాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు చేపట్టారు. 'నా ఊపిరి' పేరుతో మొక్కల నాటే కార్యాక్రమాన్ని ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పథకం