పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలోని వరాల వెంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి వివాహం చేశారు. దేవాలయ అనువంశిక ధర్మకర్తలు మంతెన వంశీయులు.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లాక్డౌన్ కారణంగా ఈ కల్యాణానికి భక్తులను అనుమతించలేదు.
సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం - పశ్చిమగోదావరి జిల్లా ఈడూరు ఆలయం
పశ్చిమగోదావరి జిల్లా ఈడూరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం Traditionally marriage of lord Venkateswaraswamy Kalyanam in westgodavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7435683-334-7435683-1591089159265.jpg)
సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం