పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో తమ పిల్లల్ని మామిడికాయలు కోసేందుకు పంపించామని.. ఇంతలోనే ప్రమాదం జరిగిందని కుటుంబీకులు విలపించారు.
ట్రాక్టర్ బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు - accident.
పశ్చిమగోదావరి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి 10 మంది కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు.వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు