నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. నిరంతరం ముఖ్యమంత్రి పడుతున్న కష్టానికి ప్రతిఫలమే ప్రజల ఆనందమన్నారు.
తాడేపల్లిగూడెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నాని ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. పట్టణంలోని 33,34,35 వ వార్డు లో పర్యటన చేశారు. పట్టణ రహదారిలో ప్రచార రథం పై తిరుగుతూ ప్రజలకు అభివాదం తెలుపుతూ ప్రచారాన్ని కొనసాగించారు.
నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి పట్టణంలో కలియతిరిగి ఓట్లు అభ్యర్థించారు. నవరత్నాలు అమలు జరగాలంటే వైసీపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ముమ్మరంగా ప్రచారాలు - WEST GODAVARI
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీల ప్రచారాలు ముమ్మరంగా సాగాయి. వివిధ పార్టీల అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు.
![పశ్చిమగోదావరి జిల్లాలో ముమ్మరంగా ప్రచారాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2811993-433-b47fd526-ae1c-4224-a8eb-4b14d51d4e44.jpg)
పశ్చిమగోదావరి జిల్లాలో ముమ్మరంగా ప్రచారాలు
పశ్చిమగోదావరి జిల్లాలో ముమ్మరంగా ప్రచారాలు
ఇవి చదవండి