ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి - actor kosuri venugal death news

ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన 22 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.

ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి
ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి

By

Published : Sep 24, 2020, 12:22 AM IST

ప్రముఖ టీవీ, సినీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి చెందారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించిన ఆయన మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే అమీతుమీ చిత్రంలో నటించారు.

ABOUT THE AUTHOR

...view details