ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిమితికి మించి పొగాకు సాగు చేయొద్దు: పొగాకు బోర్డు ఛైర్మన్​' - tobbacco board chairmen on tobacco cultivation

కూలీల కొరత, సమయం వంటి పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయానికి యాంత్రీకరణ అవసరంగా మారిందని భారత పొగాకు బోర్డు ఛైర్మన్ ఎడ్లపల్లి రఘునాథబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రామానుజపురంలో యాంత్రీకరణ పద్ధతి ద్వారా సాగు చేస్తోన్న పొగాకు తోటలను ఆయన పరిశీలించారు.

పరిమితికి మించి పొగాకు సాగు చేయోద్దు: భారత పొగాకు బోర్డు ఛైర్మన్

By

Published : Nov 4, 2019, 2:47 PM IST

'పరిమితికి మించి పొగాకు సాగు చేయొద్దు: పొగాకు బోర్డు ఛైర్మన్​'

వ్యవసాయంలో అన్ని పంటలకు యాంత్రీకరణ పద్ధతి అవసరంగా మారిందని భారత పొగాకు బోర్డు ఛైర్మన్ ఎడ్లపల్లి రఘునాథబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో... యాంత్రీకరణ పద్ధతి ద్వారా నాటుతున్న పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. గత నాలుగేళ్లుగా పొగాకు రైతులు పూర్తిగా నష్టపోతున్నారని... పరిమితికి మించి ఎక్కువ సాగు చేయవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క బారన్​కు రూ.10 లక్షలు పరిహారం అందిస్తే .. పొగాకు సాగుకు విరామం పలుకుతామని రైతులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details