పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ.. తల్లాడ-దేవరాపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రారంభంలో అన్ని రకాల గ్రేడులను కొనుగోలు చేస్తామని చెప్పిన మార్క్ఫెడ్ ప్రతినిధులు... అనంతరం మాట తప్పారని వాపోయారు. పొగాకు కొనుగోళ్లలో కంపెనీల వైఖరి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మద్దతు ధర కల్పించాలని గోపాలపురంలో రైతుల ఆందోళన - farmers protest in west godavari district
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో రైతులు ఆందోళన చేశారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
![మద్దతు ధర కల్పించాలని గోపాలపురంలో రైతుల ఆందోళన tobacco Farmers protest in gopalapuram west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8894223-854-8894223-1600771212123.jpg)
మద్దతు ధర కల్పించాలని గోపాలపురంలో రైతుల ఆందోళన