పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రారంభించారు. ప్రారంభ ధర కిలో 175 రూపాయలు అని నిర్ణయించగా... రైతులు ఆందోళన చేశారు. కనీస మద్దతు ధర రావడంలేదని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలిరోజు వేలం ప్రక్రియను అడ్డుకున్నారు. సరాసరి ధర కిలోకు రూ.180 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో పొగాకు వేలం తాత్కాలికంగా నిలిపివేశారు.
వర్జీనియా పొగాకు: రైతుకు మద్దతు ధర ఏదీ..? - పశ్చిమ గోదావరిలో వాయిదా పడిన పొగాకు వేలం
పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రారంభ ధర రైతుల ఆశించిన దానికంటే తక్కువ ఉండగా... వేలం తాత్కాలికంగా నిలిపివేశారు. ధరపై రైతు సంఘం నాయకులు చర్చించుకొని, బోర్డు సభ్యులకు వినతిపత్రం అందజేయనున్నారు.
వాయిదా పడిన పొగాకు వేలం