పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు. సంబంధిత పత్రాలను శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందజేత - mla karumuri venkata nageswara rao news
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తణుకులో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు.
karumuri venkata nageswara rao
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. తణుకు పట్టణంలోని లబ్ధిదారుల కోసం ప్రభుత్వం 145 ఎకరాలు కొనుగోలు చేయడం చరిత్రాత్మక విషయమని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం పేదల కోసం సెంటు భూమి కూడా కొనలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి
మంత్రి పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ కన్నుమూత