ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాకు 3 వరి విత్తన శుద్ధి కేంద్రాలు మంజూరు - west godavari latest news

పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రభుత్వం అదనంగా మూడు వరి విత్తన శుద్ధి కేంద్రాలను మంజూరు చేసింది. ఒక్కో కేంద్రాన్ని 60 లక్షల రూపాయలతో నిర్మించనున్నారు.

జిల్లాకు మూడు వరి విత్తన శుద్ధి కేంద్రాలు మంజూరు
జిల్లాకు మూడు వరి విత్తన శుద్ధి కేంద్రాలు మంజూరు

By

Published : Oct 3, 2020, 4:08 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రభుత్వం అదనంగా 3 వరి విత్తన శుద్ధి కేంద్రాలను మంజూరు చేసింది. ఇప్పటివరకు తణుకు, మార్టేరులలో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. వీటికి అదనంగా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మూడు విత్తన శుద్ధి కేంద్రాలను మంజూరు చేశారు.

విత్తన శుద్ధి కేంద్రం వద్ద కర్మాగారంతో పాటు నిల్వ గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉన్న మేరకు.. ఒక్కో కేంద్రానికి ఎకరం స్థలం అవసరం అవుతుందని అధికారులు నిర్ధరించారు. కోడూరు మండలం రావిపాడు, నిడదవోలు మండలం కంసాలిపాలెంలో స్థలం గుర్తించారు. మూడో కేంద్రం ఏర్పాటుకు బుట్టాయిగూడెం దేవులపల్లి గ్రామాల్లోని స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో విత్తనశుద్ధి కేంద్రాన్ని 60 లక్షల రూపాయలతో నిర్మించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details