పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచిన... ఆళ్ల నానికి జగన్ జట్టులో చోటుదక్కింది. 1970 డిసెంబర్ 29న దెందులూరు మండలం టెక్కనవారిగూడెంలో నాని జన్మించారు. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. బీకాం చదువుకున్న ఆళ్ల నాని... ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2012 ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గెలిచారు. తాజా ఎన్నికల్లో గెలుపొంది... జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)
నియోజకవర్గం:ఏలూరు
వయస్సు:49
విద్యార్హత:బీకాం
రాజకీయ అనుభవం:నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు.
చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఉండి మండలం ఎండగండిలో 1953 సెప్టెంబర్ 19న జన్మించిన శ్రీరంగనాథరాజు... ఇంటర్ వరకు చదువుకున్నారు. 2004 అత్తిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా వైకాపా తరపున ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా రైసు మిల్లర్ల సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.