ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు, ఆటో ఢీ...ముగ్గురు మృతి - 3 members died in an accident of car, auto

కారు, ఆటో ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన...పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు వద్ద చోటుచేసుకుంది.

కారు, ఆటో ఢీ...ముగ్గురు మృతి

By

Published : Sep 17, 2019, 9:51 AM IST

కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన... పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలంలోని ఏపూరు వద్ద చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మేజాపురం నుంచి నూజివీడు రైల్వేస్టేషన్​కు వెళ్తున్న ఆటోను... హనుమాను జంక్షన్ నుంచి సీతారామపురం వెళ్తున్న కారు ఏపూరు సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న యార్లగడ్డ సుధారాణి, మన్మంత్ అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా...మార్గమధ్యలో సాయి త్రిపుర మృతి చెందింది. పెదపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు, ఆటో ఢీ...ముగ్గురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details