Car accident in AP: రోడ్డు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ఉహించలేం. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కారు బీభత్సం సృష్టించింది. శర్మిష్ఠ కూడలి వద్ద రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి ఆగిపోయింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. కారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Three injured: పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు - Car accident
Car accident: రోడ్డు ప్రమాదాల విషయంలో కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా బాధితులుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేగ నియంత్రణ కోల్పోయిన కారు రహదారిపై వెళ్తున్న వారి మీదకు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పాదాచారుల పై దూసుకెళ్లిన కారు
Last Updated : Oct 2, 2022, 5:01 PM IST